TMC:నెక్ట్స్ బాబుల్ సుప్రియో?

2
- Advertisement -

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఒక్కసారిగా అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. ఇటీవలే ముగ్గురు టీఎమ్‌సీ రాజ్యసభ ఎంపీలు సుస్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరైక్, సుఖేందు శేఖర్ రాయ్‌లు తమ పదవులకు, పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో రాజ్యసభ ఎంపీ బాబుల్ సుప్రియో కూడా రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించిన సుప్రియో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. గతంలో తాను బీజేపీలో ఉన్నప్పుడు కూడా రాజకీయ ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖచ్చితంగా ఖండించనప్పటికీ ప్రస్తుతం తాను ఉన్న పార్టీ, నాయకత్వంతోనే కొనసాగుతున్నానని సుప్రియో పేర్కొన్నారు. అదే సమయంలో తన రాజకీయ నిర్ణయాలను సొంతంగా తీసుకునే హక్కు తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్

పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీకి ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. టీఎంసీ టికెట్‌పై గెలిచిన 20 మంది లోక్‌సభ ఎంపీలు పార్లమెంట్‌లో తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరారు.

- Advertisement -