కేరళలో ప్రమాదకరమైన ‘నిఫా’ వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ లక్షణాలు బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.
ఇటీవల ఒక గిడ్డంగిని శుభ్రం చేసిన 43 ఏళ్ల వ్యక్తికి జరిపిన ప్రాథమిక పరీక్షల్లో నిఫా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం సదరు రోగి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే, ఈ ఫలితాన్ని పూర్తిగా నిర్ధారించుకోవడానికి రోగి యొక్క శాంపిల్స్‌ను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపించారు.
సదరు బాధితుడు నిఫా లక్షణాలు బయటపడటానికి ముందు పలు ఆసుపత్రులకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన ఆరోగ్య సిబ్బంది వెంటనే ‘కాంటాక్ట్ ట్రేసింగ్’ (బాధితుడిని కలిసిన వారిని గుర్తించే ప్రక్రియ) ప్రారంభించారు. ఇందులో భాగంగా రోగితో పరిచయం ఉన్న పలువురు ఆసుపత్రి సిబ్బందిని ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. నిఫా వ్యాప్తిని అరికట్టేందుకు కోజికోడ్ జిల్లా వ్యాప్తంగా నిఘా తీవ్రం చేశారు.
Also Read:సుప్రీంకు మీనాక్షి నటరాజన్

