రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ తెలుగు ప్రజలు మాత్రం బీజేపీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో కొద్దిగా బీజేపీ మెరుగ్గానే ఉన్నప్పటికి ఏపీలో కాషాయ పార్టీ పరిస్థితి మరి దారుణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అసలు ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవంటే అతిశయోక్తి కాదు. దీంతో ఏపీలో సత్తా చాటలని, ఇక్కడి స్థానిక పార్టీలకు పోటీనివ్వాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. కానీ కమలం పార్టీ ఎన్ని ప్రయత్నలు చేసిన ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేవు. దీనికి ప్రధాన కారణం పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడం అలాగే నేతల మద్య సమన్వయ లోపం ఉండడం. .
దీంతో వీటిని అధిగమించేందుకు అధిష్టానం కీలక పదవుల్లో ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు ను తప్పించి ఆయన స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరికి ఆ బాద్యతలు కట్టబెట్టింది. సోము వీర్రాజు పదవి కాలంలో ఉన్నప్పుడూ ఆయనపై విమర్శలు గట్టిగానే వినిపించాయి. వైసీపీ, టీడీపీ పార్టీలపై ప్రభావవంతంగా విమర్శలు చేయడంలో సోము వీర్రాజు విఫలం అయ్యాడని, అలాగే పార్టీలోని నేతలతో ఐక్యంగా లేడని, సొంత నిర్ణయాలు పార్టీకి ఆపాదిస్తాడని ఇలా రకరకాల విమర్శలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో పార్టీలోని అంతర్మధనాన్ని తగ్గించేందుకు ఎవరు ఊహించని విధంగా పురందేశ్వరిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది అధిష్టానం. మరి పురందేశ్వరి అధ్యక్ష హోదాలో పార్టీలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందనేది ఆసక్తికరం. ముఖ్యంగా ఏపీలో బీజేపీ చుట్టూ పొత్తు రాజకీయాలు చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలో పొత్తులపై పురందేశ్వరి ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఇక అలాగే నేతల మద్య సమన్వయం కుదూర్చడంలోనూ ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి పురందేశ్వరి నాయకత్వంలోనైనా బీజేపీ దశ తిరుగుతుందేమో చూడాలి.
Also Read:సినీ రంగంలోకి షర్మిల కొడుకు!