ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఇండియన్ రైల్వే వివిధ రకాల ఆఫర్లతో ముందుకువస్తోంది. ఇప్పటివరకు ఐఆర్‌సీటీసీ ద్వారా సేవలను అందిస్తున్న రైల్వే ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో చేతులు కలిపింది. ఎస్‌బీఐ ప్లాటినం కార్డు ద్వారా వివిద రకాల ఆఫర్లను అందిస్తోంది.
వెల్‌కమ్ గిఫ్ట్, వ్యాల్యూ బ్యాక్ బెనిఫిట్స్, ట్రావెల్ ఆఫర్లు, ఫ్యూయెల్ సర్‌చార్జ్ వంటి వివిధ రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీతో లింక్ చేసుకుంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అన్ని రకాల ఏసీ క్లాస్ టికెట్ బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా రివార్డ్ పాయింట్స్ ద్వారా ఫ్రీ టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే వన్ టైమ్ యాన్యువల్ ఫీజు రూ.500 చెల్లించాలి. ఆ తర్వాత రెన్యువల్ ఫీజు ఏడాదికి రూ.300. ఈ కార్డుతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తే 1.8 శాతం ట్రాన్సాక్షన్ ఛార్జీల మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు ఫ్లైట్ టికెట్లు కూడా ఐఆర్‌సీటీసీ ద్వారా తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు.