రూ.33 కోసం రైల్వేతో రెండేళ్ల పోరాటం..చివరకు..!

580
indian railway
- Advertisement -

రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తికి రైల్వే అధికారులు దిమ్మ తిరిగే షాకిచ్చారు. టికెట్ క్యాన్సిల్ చేసిన రెండేళ్లకు రిఫండ్ చెల్లించారు. ఆ చెల్లించిన మొత్తం ఎంతో తెలిస్తే షాకవుతారు. కేవలం రూ.33. తనకు రావాల్సింది తక్కువ మొత్తమే అయినా పట్టువదలని విక్రమార్కుడిలా రైల్వే అధికారులతో పోరాడి సాధించకున్నాడు.

2017 జులైలో కోటా నుంచి న్యూఢిల్లీ వెళ్లేందుకు స్వామి అనే వ్యక్తి ఏప్రిల్ నెలలో రూ.755 చెల్లించి టికెట్ కొనుగోలు చేశాడు. అయితే దానిని క్యాన్సిల్ చేయగా రూ.655 రీఫండ్ వచ్చింది. రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జ్ రూ.65 కాగా దానికి అదనంగా రూ.35 సర్వీస్ ట్యాక్స్‌ విధించి రూ.110 కట్ చేసింది.

దీంతో ఐఆర్‌సీటీసీపై పోరాటానికి దిగారు సుజీత్ స్వామి. సమాచార హక్కు చట్టం ద్వారా వెయింటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాడు. జీఎస్టీ అమలుకు ముందు బుక్ చేసుకున్న టికెట్‌ను జీఎస్టీ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నట్లయితే సర్వీస్ ట్యాక్స్ తిరిగి చెల్లించబోమని రైల్వే పేర్కొంది. అయితే, జీఎస్టీ అమలుకు ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా తనకు రూ.35 సర్వీస్ ట్యాక్స్ విధించడంతో రెండేళ్లుగా అధికారులతో పోరాడుతూనే ఉన్నాడు. దీంతో ఎట్టకేలకు స్పందించిన రైల్వే మే 1న స్వామి అకౌంట్‌లో రూ.33 డిపాజిట్ చేసింది.

అయితే కేవలం 33 రూపాయల కోసం ఇంత అవసరమా అని అంతా అనుకుంటారు. మనలో చాలామంది తక్కువ మొత్తమే కదా అని వదిలేస్తాం..అయితే ఆ వ్యక్తి మాత్రం అలా కాకుండా ముక్కు పిండి మరీ వసూలు చేసి ఐఆర్‌సీటీసీ ఇంకొకరికి అలా చేయకుండా గట్టి బుద్దిచెప్పాడు. అంతేగాదు గత రెండేళ్లుగా ఐఆర్‌సీటీసీ తనను వేధింపులకు గురిచేసినందుకు న్యాయపోరాటానికి దిగనున్నానని సుజీత్ తెలిపారు.

- Advertisement -