ఐపీఎల్‌లో రెండు కొత్త టీమ్‌లు..

143
- Advertisement -

ఐపీఎల్ 2023 వేలానికి రంగం సిద్ధమైంది. ఈసారి వేలంలో రెండు కొత్త ప్రాంచైసీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ విలువ 1.6బిలియన్ డాలర్లు.

ఇక ఈసారి ఐపీఎల్ టీవీ రైట్స్ హక్కులు రూ. 23,575 కోట్లకు డిస్నీ స్టార్ గెలుచుకుంది. డిజిటల్ రైట్స్ వయాకామ్ 18 సంస్థ 23,758కోట్లకు దక్కించుకుంది. ఇక ఈ సారి టోర్నమెంట్ లో మ్యాచ్ ల సంఖ్య 74 నుంచి 94 పెంచారు.

డిసెంబర్ 23న వేలానికి రంగం సిద్ధంకాగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.మొత్తం 991 మంది ఆటగాళ్లు వేలానికి దరఖాస్తు చేసుకోగా.. 405 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వేలానికి షార్ట్‌లిస్ట్ చేశాయి. వీరిలో 273 మంది ఇండియన్ క్రికెటర్లు కాగా.. 132 మంది విదేశీ ఆటగాళ్లున్నారు.

నిబంధనల ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ తమ పూర్తి బడ్జెట్లో 75 శాతం వరకు ఖర్చు చేయడానికి అనుమతిస్తారు. అంతకు మించి ఖర్చు చేయడం కుదరదు. ప్రతి జట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఈసారి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న అత్యంత పిన్న వయస్కుడు అప్ఘానిస్థాన్‌కు చెందిన కుడి చేతి వాటం ఆఫ్ స్పిన్నర్ అల్లాహ్ మహ్మద్ ఘజనఫర్ కాగా పెద్ద వయస్కుడు అమిత్ మిశ్రా.

ఇవి కూడా చదవండి..

- Advertisement -