పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ‘ అర్ద చంద్రాసనం ‘ !

186
- Advertisement -

నేటి రోజుల్లో మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా జింక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. ఫలితంగా ఊబకాయం, ఆదిక బరువు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఆదిక బరువును తగ్గించడానికి ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు చాలా మంది. అయితే దీనికి యోగాలోని అర్ద చంద్రసనం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు యోగా నిపుణులు. అర్ధ చంద్రసనం రోజు వేయడం వల్ల శరీర సమతుల్యత మెరుగు పడుతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించడంలో అర్ద చంద్రసనం ఎంతగానో ఉపయోగ పడుతుంది. అలాగే పొట్ట ఛాతీ బాగాలకు సంబంధించిన వ్యాధులను కూడా అర్ద చంద్రసనం ద్వారా నివారించవచ్చు. ఇంకా వెన్ను నొప్పి, నడుం నొప్పి వంటి సమస్యల నుంచి కూడా అర్ద చంద్రసనం వేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

అర్ధచంద్రాసనం వేయు విధానం.

మొదటగా చదునైన నేలపై రెండు పదాలను ఒకే చోట దగ్గరగా ఉంచుకొని నిటారుగా నిలబడలి.
తరువాత రెండు పదాలను దూరంగా ఉంచి, కుడి కాలిపై శరీరం బరువును మోపుతూ ఎడమ కాలు పక్కకు లేపాలి. కుడి చేయి నేలకు ఆనించి ఎడమ చేయి ఆకాశం వైపుగా ఎత్తుతూ పక్కకు వంగాలి. తల ఆకాశం వైపు ఎత్తిన చేతిని చూడాలి. ఇలా చేసినప్పుడు అర్దచంద్రసనం ఏర్పడుతుంది. ఇలా ఒక 1-2 నిముషాల వరకు అలాగే ఉండాలి. ఆ తరువాత మరోవైపు కూడా అలాగే చేయాలి.

ఇలా 5-10 నిముషాల పాటు రోజు ఈ అర్ద చంద్రసనం వేయడం వల్ల బాడీ కొలెస్ట్రాల్ శాతం తగ్గి, సమతుల్యత ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -