ఐపీఎల్ 2023లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది లక్నో. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్‌పై లక్నో 10 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(44; 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్(40; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అర్థశతకానికి చేరువైన జైశ్వాల్‌ను స్టోయినిస్ ఔట్ చేయడంతో వికెట్ల పతనం ఆరంభమైంది. సంజు శాంసన్(1),హెట్‌మయర్(2) ఔట్ కావడంతో 104 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పడిక్కల్(26), రియాన్ పరాగ్(15 నాటౌట్) లు ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోవడంతో 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!
ఇక అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(39; 32 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్), కైల్ మేయర్స్(51; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శుభారంభం అందించారు. మార్కస్ స్టోయినిస్(21; 16బంతుల్లో 2 ఫోర్లు), నికోలస్ పూరన్(28; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
Also Read:పిక్ టాక్ : ఒంపుసొంపులతో షేక్ చేసింది