IPL 2023 : ధోనితో రోహిత్ ఢీ.. డిల్లీకి చావో రేవో !

66
- Advertisement -

వీకెండ్ కావడంతో నేడు ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనుంది. నేటి మ్యాచ్ లలో మొదట చెన్నై వర్సస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనుండగా రెండవ మ్యాచ్ డిల్లీ క్యాపిటల్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. చెన్నై మరియు ముంబై మధ్య జరిగే మ్యాచ్ మద్యాహ్నం 3:30 నిముషాలకు ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్ లో చెన్నై విజయం సాదించింది. ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు జట్లే ఎక్కువసార్లు చాంపియన్స్ గా నిలిచిన జట్లు కావడంతో ముంబై చెన్నై జట్లు ఎప్పుడు తలపడిన మ్యాచ్‌ రసవత్తరంగానే ఉంటుంది.

ఇక ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 సార్లు హెడ్ టూ హెడ్ తలపడగా.. అందులో ముంబై 20 సార్లు విజయం సాధిస్తే, చెన్నై 15 సార్లు విజయం సాధించింది. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన ప్రతి మ్యాఛ్ కూడా హోరాహోరీగానే జరిగింది. మరీ నేడు జరిగే ఈ పే బ్యాక్ మ్యాచ్‌ లో ఏ జట్టు విజయం సాధిస్తుందో చూడాలి. ఇక రెండవ మ్యాచ్‌ లో బెంగళూరుతో డిల్లీ తలపడనుంది. రాత్రి 7; 30 నిముషాలకు ప్రారంభం అయ్యే ఈ మ్యాఛ్ డిల్లీకి చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో డిల్లీ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేదంటే డిల్లీకి ప్లే ఆఫ్ తలుపులు మూసుకుపోయినట్లే.

Also Read: మే 6..మోతీలాల్‌ నెహ్రూ జయంతి

ప్రస్తుతం బెంగళూరు ఫుల్ ఫామ్ లో ఉంది. 9 మ్యాచ్‌ లు ఆడి అందులో ఐదు మ్యాచ్‌ లు గెలిచి టాప్ 5 లో కొనసాగుతుంది. ఇక గత మ్యాచ్‌ లక్నోపై కూడా విజయం సాధించి డిల్లీపై పైచేయి సాధించేందుకు ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు డిల్లీ 9 మ్యాచ్‌ లు అడగా అందులో మూడు మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివర నిలిచింది. అయితే గత మ్యాచ్‌ గుజరాత్ పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న డిల్లీ.. బెంగళూరుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరి బెంగళూరుని డిల్లీ ఎంతవరకు కట్టడి చేస్తుందో చూడాలి.

Also Read: కోపం చల్లారాలంటే చల్లగా యాడ్ చేయండి :యువరాజ్

- Advertisement -