మే 6..మోతీలాల్‌ నెహ్రూ జయంతి

95
- Advertisement -
భారత స్వాతంత్ర  పోరాటంలో పండిట్ మోతీలాల్ నెహ్రూ ఒకరు. ఈయన మే 6, 1861 గంగాధర్ నెహ్రూ జియోరానీ దంపతులకు జన్మించారు. మోతీలాల్ నెహ్రూ 1883లో వకీల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో ప్రాక్టీస్ చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చెలరేగిన అంతర్గత కలహాల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
1917లో అలహాబాద్ హోంరూల్ లిగ్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం బొంబాయి కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యి మోంటెగ్ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలలో మార్పులను తీసుకురావాల్సిందిగా కోరారు. అంతేకాదు ఫిబ్రవరి 5,1919లో ది ఇండిపెండింట్ అనే పేరుతో జాతీయ దినపత్రికను ప్రారంభించారు. మోతీలాల్‌ చిత్తరంజన్‌దాస్‌తో కలిసి 1923 జనవరిలో స్వారాజ్య పార్టీని స్థాపించారు. ఈ  పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేశారు.
1925లో హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో లార్డ్ బిర్కెన్ హుడ్ భారతీయులకు సవాలు విసిరారు. భారతీయులకు రాజ్యంగాన్ని రాసుకోవడం తేలీదు. వారికి పరిపాలించడం చేతకాదు అని ప్రకటించారు. ఈ సవాలును స్వీకరించి 1928లో నెహ్రూ నివేదికను తయారు చేశారు. దీన్ని భారతదేశ చరిత్రలో మొదటి రాజ్యంగాంగా పేర్కొన్నారు. 1930లో జవహర్‌లాల్‌నెహ్రూ ప్రవేశ పెట్టిన ఆశయాల తీర్మానంకు ఈ నెహ్రూ నివేదిక కీలకమైన అంశాలను పొందుపరిచారు. అయితే నెహ్రూ రిపోర్ట్‌ను కాంగ్రెస్‌ సభ్యులు తిరస్కరించారు.  సైమన్ కమీషన్‌లో భారతీయులు లేరని దాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన సమావేశానికి అధ్యక్షత వహించారు. మోతీలాల్‌ ఫిబ్రవరి6, 1931 మరణించారు.
- Advertisement -