యూఏఈలో ఐపీఎల్ 14వ సీజన్: బీసీసీఐ

218
uae
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఎలా ఉండనుందనే సందేహాలు, రోజుకో గాసిప్స్ వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

మిగిలిన 31 మ్యాచ్‌లను యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌(యూఏఈ)లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు బీసీసీఐ వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ లో ఇండియాలో వార్షాకాలం ఉంటుంద‌ని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మిగితా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన స్పెష‌ల్ జ‌న‌ర‌ల్ మీటింగ్‌లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

టీమ్ ఇండియా జూన్ 2న ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్లనుండగా అక్కడ మొదట న్యూజీలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనుంది. ఆ తర్వాత అగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఐదు టెస్టుల సిరీస్ ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల తర్వాత సెప్టెంబర్ 15 నుంచి ఐపీఎల్ నిర్వహించనున్నారు.

- Advertisement -