ఐపీఎల్ 14 అప్‌డేట్!

55
ipl

ఐపీఎల్ 14 కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఐపీఎల్ 13 ఫ్యాన్స్ లేకుండా జరిగిన మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఏడాది మాత్రం ప్రేక్షకుల సమక్షంలో ఐపీఎల్ జరగనుంది. ఈ మేరకు సెంట్రల్ స్పోర్ట్స్​ మినిస్ట్రీ జారీ చేసిన ఎస్​వోపీని అమలు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

ఐపీఎల్ కౌన్సిల్‌తో కలిసి బీసీసీఐ స్పెషల్ కొవిడ్ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. అలాగే మ్యాచ్ వేదికల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఇంగ్లండ్​తో సిరీస్​కు కూడా ఫ్యాన్స్ మధ్యలో జరిపేందుకు ప్లాన్స్​ రెడీ చేస్తోంది బీసీసీఐ. మొత్తంగా ఫ్యాన్స్​ను అనుమతించే విషయంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి పర్మిషన్​ను తీసుకోవాల్సి ఉంటుంది.