- Advertisement -
ఐపీఎల్ 2020 యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు ఐపీఎల్ జరగనుండగా ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి నెలరోజుల ముందే ఆటగాళ్లు యూఏఈ చేరుకోనుండగా కరోనా నిబంధనల ప్రకారమే టోర్నీ జరగనుంది.
ఇక ఈసారి ఐపీఎల్ సీజన్‌లో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే పాల్గొననున్నారు. మహమ్మద్ సిరాజ్,అంబటి రాయుడు,బావనక సందీప్ ఈసారి ఐపీఎల్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఇందులో హైదరాబాద్ రాంనగర్ కి చెందిన బావనక సందీప్ ఐపీఎల్ లోకి అరంగేట్రం చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ రంజీ జట్టు కు వైస్‌కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు సందీప్. మొత్తంగా ఈ సారి ఐపీఎల్‌లో తెలుగు ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో వేచిచూడాలి.
- Advertisement -