భారీగా తగ్గిన బంగారం ధర…ఎంతో తెలుసా!

215
gold rate

పసిడి ప్రేమికులకు నిజంగా ఇది శుభవార్తే..వరుసగా నాలుగోరోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. నాలుగోరోజు వేలల్లో బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.3350 తగ్గి రూ.54,680కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3010 తగ్గి రూ.50,130కు చేరింది.

బంగారం ధర వేలల్లో తగ్గితే వెండి మాత్రం స్వల్పంగా కేవలం రూ. 50 తగ్గింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 72,550గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.15 శాతం తగ్గి 1944 డాలర్లకు దిగివ‌చ్చింది.