- Advertisement -
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్‌లో తొలి సెంచరీ సాధించిన గేల్…తన మార్క్ ఆటతీరుతో రాజస్ధాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలుత నెమ్మదిగా ఆడిన గేల్ తర్వాత విశ్వరూపం చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు,సిక్సర్లతో విరుచుకపడ్డాడు. 63 బంతుల్లో 8 సిక్స్ లు,6 ఫోర్లతో 99 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు.
పంజాబ్ తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి ఓవర్ ఆఖరి బంతికి మన్‌దీప్ సింగ్..స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు రాహుల్. 46 పరుగులు చేసి రాహుల్ ఔటైనా గేల్ మాత్రం రాజస్ధాన్ బౌలర్ల పాలిట విలన్‌గా మారాడు. గేల్ సునామీతో 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 185 పరుగులు చేసింది.
- Advertisement -