రైతు వేదికల ఏర్పాటులో దేశంలోనే తొలి రాష్ట్రం..

851
raithu vedika
- Advertisement -

వ్యవసాయ విస్తరణ అధికారుల క్షేత్రాల్లో రైతువేదికల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
572.22 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు.
ఒక్కో వేదికగా 22 లక్షల రూపాయల ఖర్చు.
312.12 కోట్ల రూపాయల వాటాను భరించనున్న వ్యవసాయశాఖ.
ఒక్కో రైతు వేదికకు 12లక్షల ఖర్చు చేయనున్న వ్యవసాయశాఖ.
ఎంఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి వినియోగం.
రైతువేదికల ఏర్పాటులో దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ.
సగటు రైతు ఆధాయాన్ని స్థీరీకరించి ఎక్కువ లాభాలు పొందే వీలుగా వేదికలు.

రైతులు సమూహాలుగా ఏర్పడి మంచి గిట్టుబాటు ధర పొంది తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారడానికి ఉపకరించనున్న రైతు వేదికలు.
రైతులు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తెచ్చేలా రైతు వేదికల నిర్మాణం.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మెరుగుపరిచి వ్యవసాయరంగాన్ని శాశ్వతంగా లాభసాటిగా మార్చేలా రైతువేదికలు ఉపయోగపడుతాయి.
నిర్దేశిత విధానంతో వ్యవసాయాన్ని మంచి ఆదాయ మార్గంగా మలిచేందుకు ఉపయోగపడనున్న రైతు వేదికలు.

రైతు సంక్షేమ విధానాలు, ప్రభుత్వం ఇస్తున్న సబ్సీడీల సమాచారాన్ని రైతులకు చేరవేయనున్న రైతువేదికలు.
వ్యవసాయంలో రైతుల నైపుణ్యతను పెంచడానికి దోహదపడనున్న రైతు వేదికలు.
ఆధునిక, వినూతన్న వ్యవసాయ విధానాలను అవలంభించడానకి మార్గంగా రైతువేదికలు.
వ్యవసాయం దాని అనుబంధరంగాల్లో రుణాల వెసులుబాటు కల్పించడానికి రైతులందరూ ఒకే వేదికపై కూర్చుండి అవగాహన పెంచుకోవడానికి రైతు వేదికల తోడ్పాటు.
శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా రైతువేదికలు.
రైతు సమూహాలుగా ఏర్పడి తమ హక్కులను కాపాడుకోవాడానికి ఉపకరించనున్న రైతు వేదికలు.

మొత్తం రైతు వేదికలు 2601.
గ్రామాల్లో 2462, పట్టణాల్లో 139.
పట్టణ సమూహాల్లో ఉన్న గ్రామ పంచాయితీల్లో 74.
గ్రామపంచాయితీ లేని పట్టణ సమూహాల్లో 65.
దాతల ద్వారా గ్రామాల్లో నిర్మితమైన రైతు వేదికలు 22.
దాతల ద్వారా పట్ణణాల్లో నిర్మితమైన రైతు వేదికలు 2.
దాతలు ఇచ్చిన స్థలాల్లో నిర్మితిమైన రైతువేదికలు 139.
అందులో గ్రామాల్లో 137, పట్టణాల్లో-2.
ఇఫ్పటి వరకు పూర్తి అయిన రైతు వేదికలు1951.
నిర్మాణంలో ఉన్న రైతు వేదికలు 650.

- Advertisement -