ముంబైలో ఘనంగా కాజల్ అగర్వాల్ పెళ్లి..

172
kajal

గౌతమ్ కిచ్లూతో టాలీవుడ్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సెలబ్రిటీ పెళ్లికి నగరంలోని తాజ్ ప్యాలెస్ స్టార్ హోటల్ వేదికగా నిలిచింది. సంప్రయదాయ పెళ్లి దుస్తుల్లో కాజల్, గౌతమ్ కిచ్లూ వివాహ మంటపంలో కనువిందు చేశారు. ముఖ్యంగా, కాజల్ పెళ్లికూతురు డ్రెస్సులో మెరిసిపోయింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ వివాహం జరిగింది. అంతకుముందు, కాజల్ తన తల్లి సుమన్ అగర్వాల్ తో కలిసి తన నివాసం నుంచి తాజ్ ప్యాలెస్ కు వెళ్లే క్రమంలో ఎంతో హుషారుగా మీడియాకు అభివాదం చేశారు. అంతేకాదు, కొందరు అభిమానులను కూడా ఆమె విష్ చేశారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.