ఐపీఎల్ 15వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. నాలుగో వేవ్ ప్రమాదం పొంచిఉన్న తరుణంలో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతిస్తూ.. బయోబబుల్‌లో మ్యాచ్‌లను నిర్వహించేందుకు పాలక మండలి సమాయత్తమైంది.
తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తలపడనున్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ తొలిసారి కేవలం ప్లేయర్‌గా మైదానంలో అడుగు పెట్టనుండగా జడేజా జట్టును ముందుకు నడుపనున్నాడు.
గత సీజన్‌లో అద్వితీయ ప్రదర్శనతో విజేతగా నిలిచిన చెన్నై …వాంఖడే వేదికగా బోణీ కొట్టాలని జడ్డూ సేన యోచిస్తున్నది. రుతురాజ్, మోయిన్ అలీ, రాయుడు, ధోనీ, బ్రావో, శివమ్ దూబే, జోర్డన్, శాంట్నర్‌తో చెన్నై జట్టు పటిష్టంగా కనిపిస్తున్నది.
కరోనా కారణంగా గత రెండేండ్లుగా యూఏఈలో సాగిన ఐపీఎల్..ఈసారి స్వదేశంలో అభిమానులను అలరించనుంది.మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో ఐపీఎల్ 15వ సీజన్ జరగనుండగా టెన్నిస్ తరహాలో తొలిసారి సీడింగ్ పద్ధతిలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది.