Keralam:సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు

3
- Advertisement -

కేరళ కొచ్చిలో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు అయింది.మోడలింగ్ పేరిట విదేశాల్లో సెక్స్ రాకెట్ నడుపుతోంది ముఠా. మోడలింగ్, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని ఆశ చూపి..యువతుల్ని వ్యభిచారంలోకి దింపుతున్నారు నిందితులు.

రాకెట్ వెనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ గ్యాంగుల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇద్దరు బాధిత యువతుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు అధికారులు .

యువతుల్ని పరిచయం చేసిన ఏజెంట్లకు భారీగా డబ్బు ఇస్తుండగా విదేశాల్లో మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్‌పోల్ సాయం తీసుకునే యోచనలో కొచ్చి పోలీసులు ఉన్నారు.

ALso Read:చిన్నతనంలో జంక్ ఫుడ్..షాకింగ్!

- Advertisement -