తెలంగాణ జలసౌధకు అరుదైన గౌవరం..

393
Telangana Jalasoudha
- Advertisement -

తెలంగాణ జలసౌధ(సాగునీటిశాఖ)కు అరుదైన గౌవరం దక్కింది. కేసీఆర్ మనసపుత్రిక మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సక్సస్ ఫుల్ పోగ్రాం మిషన్ కాకతీయపై బాలి (ఇండోనేషియా)లో జరిగే సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్లకు ఆహ్వానం అందింది. ఇందుకు గాను ఇంజనీర్ల బృందానికి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ అభినందనలు తెలిపారు.

అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3 పథకాలపై అంతర్జాతీయ సదస్సులో పత్రాలు సమర్పించాలని ఇంటర్నేషనల్ కమిషన్ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్ సంస్థ ఆహ్వానించింది. నీటిపారుదల శాఖ ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే ఆధ్వర్యంలోని బృందం ఈ 3 అంశాలపై సెప్టెంబర్ నెలలో బాలి(ఇండోనేషియా) జరిగే సదస్సులో అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

1.మిషన్ కాకతీయ ,చిన్ననీటి వనరుల పునరుద్ధరణ.
2. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునికీకరణ ( నీటి వృధాను అరికట్టే పద్ధతులు).
3. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా చివరి నుండి మొదలు ఆయకట్టు పద్ధతి.

- Advertisement -