ఆన్‌లైన్‌లో సీతారాముల తలంబ్రాలు: ఇంద్రకరణ్ రెడ్డి

307
indrakaran reddy
- Advertisement -

ప్రతి ఏటా ఉగాది పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరిగేది కానీ ఈ సంవత్సరం లైవ్ ద్వారా మాత్రమే భక్తులు పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలన్నారు మంత్ర ఇంద్రకరణ్ రెడ్డి. గత కొన్ని రోజుల నుండి ఈ కరోనా వైరస్‌తో తీవ్ర ఆందోళన ఉండడంతో దేవాదాయ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు.

చైనా దేశం నుండి 180 దేశాలకు కరోనా వ్యాపించిందని…మన రాష్ట్రంలో రానున్న ఇతర దేశాల నుండి మన రాష్ట్రం కు వచ్చిన వారికి రావడంతో సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇతర దేశాల నుండి వచ్చిన వారిని క్వారంటైన్‌లో పెట్టడం జరిగిందన్నారు.

దేవాలయాలో రద్దీ తక్కువగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు చెప్పడమే కాదు అక్కడ ఉన్న సిబ్బంది ని కూడా ఆదేశించామన్నారు. చాలా ఆలయాలకు భక్తులు రావడం లేదని….ముఖ్యమైన బ్రహ్మమోత్సవాలు ఉన్నప్పటికీ భక్తులు రావడం లేదన్నారు. అన్ని ఆలయాలు కూడా భక్తులు రాకుండా చర్యలు చేపట్టాం అని చెప్పారు.

శ్రీరామ నవమి ఉత్సవాలు కూడా ఆడంబరాలు లేకుండా జరపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కొంత మంది మాత్రమే హాజరై శ్రీరామ నవమి ఉత్సవాలకు హాజరవుతారని…. సీతారాముల తలంబ్రాలు కావాలి అంటే ఆన్‌లైన్ లో తీసుకోవచ్చన్నారు.

- Advertisement -