రైతులకు జీవధార కల్వకుర్తి ఎత్తిపోతల: నిరంజన్‌ రెడ్డి

282
minister niranjan reddy
- Advertisement -

రైతులకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం జీవధారం అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్‌ మినిస్టర్ క్వార్టర్స్‌లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు , ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కల్వకుర్తి పెండింగ్ పనులతో పాటు మిగిలిపోయిన భూసేకరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు.

ఏదుల రిజర్వాయర్ ను వినియోగంలోకి తీసుకొస్తే కల్వకుర్తి ఎత్తిపోతల మీద భారం తగ్గుతుందని… ఏదుల రిజర్వాయర్ తో పాలమూరు – రంగారెడ్డి జిల్లాలకు తొలిఫలితం అందబోతుందన్నారు. ఏదుల రిజర్వాయర్ నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గతంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.

కల్వకుర్తి చివరి ఆయకట్టుకు నిర్దేశించినంత వరకు నీళ్లందాలని.. ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణంతోనే కల్వకుర్తి ఎత్తిపోతలకు న్యాయం జరుగుతుందన్నారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం గతంలో జీఓ ఇచ్చిందని… ఆన్ లైన్ రిజర్వాయర్లను త్వరగా ఫైనల్ చేయాలన్నారు.

ఫీడర్ ఛానళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని… కాల్వలను ఎవరు తెంపినా కఠినచర్యలు చేపట్టి కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలన్నారు. చివరి ఆయకట్టు రైతులు కాల్వలు తెంపడం మూలంగా నష్టపోతున్నారని వేసిన ప్రతి పంట చేతికొచ్చేవరకు సాగునీరు అందిస్తాం అన్నారు. మూడువేల క్యూసెక్కుల నీళ్లు ప్రస్తుతం కాలువల నుండి వస్తున్నాయని…. మరో వెయ్యి క్యూసెక్కుల నీళ్లు తీసుకునేందుకు ఏం చేయాలో అధికారులు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.

వట్టెం నుండి నీళ్లు తీసుకుంటేనే కల్వకుర్తి ఆయకట్టుకు న్యాయం జరుగుతుందని.. కర్నెతండా, మార్కండేయ లిఫ్ట్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. త్వరలో నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు , జైపాల్ యాదవ్ , మర్రి జనార్దన్ రెడ్డి , ఆల వెంకటేశ్వర్ రెడ్డి , ఈఎన్సీ మురళీధర్ , సీఈ అనంతరెడ్డి , ఎస్ఈ అంజయ్య , ఈఈ సంజీవరావు, శ్రీకాంత్ గార్లు, డీఈ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -