టీఆర్ఎస్‌ది రైతు ప్రభుత్వం…అన్నదాతలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భవించిన అనతికాలంలోవ్యవసాయరంగంలో పురోగతి సాధించిందన్నారు.
గురువారం సోన్ మండల కేంద్రంలో రూ.22లక్షలతో నిర్మించనున్న రైతుబంధు వేదిక నిర్మాణ పనులకు మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడిన ఇంద్రకరణ్ రెడ్డి…. సీఎం కేసీఆర్ దార్శనికత,ముందు చూపుతోనే సాధ్యపడిందని చెప్పారు. రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్నామని, అందరు చర్చించుకునేందుకు, వ్యవసాయాధికారులతో సమావేశమయ్యేందుకు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు.
రైతుల కోసం బీమా పథకం,దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులందరికీ రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.5వేలు ఇస్తున్న ఘనత టీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పొలాలకు 24గంటల కరెంటు ఇస్తుందని, దీంతో రూ.7వేల కోట్లు సబ్సిడీ భారం పడుతున్న రైతుల మేలు కోసం ఈ భారం భరిస్తుందన్నారు.