ప్రముఖ ప్రోడ్యూసర్ దిల్ రాజు కథను నమ్ముకుని సినిమాలు తీయడంతో స్పెషలిస్ట్ గా చెప్పుకోవచ్చు. కథపై నమ్మకంతోనే ఆయన డిస్ట్రీబ్యూటర్ స్ధాయి నుండి బడా నిర్మాతగా ఎదిగాడు. చిన్న చిన్న సినిమాలతో పెద్ద హిట్ కొట్టే సత్తా ఉన్న నిర్మాత. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న ఎఫ్2తో పాటు మహేష్ బాబు మహర్షి సినిమాలను నిర్మిస్తున్నారు దిల్ రాజు.
తన తర్వాతి సినిమాలను కూడా లైన్ లో పెట్టకున్నాడు దిల్ రాజు. ఇటీవల నాని హీరోగా తమిళ సూపర్ హిట్ 96ను రీమేక్ చేయనున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో నాని హీరోగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నారట. ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నట్లు తెలస్తుంది. ఆసినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అందులో నాని ఒక హీరోగా తీసుకోగా.. మరో హీరో కోసం వెతుకున్నారు ఇంద్రగంటి. మొదట నిఖిల్ ను సెకండ్ హీరోగా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నానితో పాటు సౌత్‌లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దుల్కర్ నటిస్తే ఇతర భాషల్లోనూ సినిమా రిలీజ్ చేయోచ్చన్న ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు.