తెలంగాణ మ‌హిళా క్రికెట‌ర్ గా ర‌ష్మీక‌…

629
rashimika
- Advertisement -

క‌న్న‌డ భామ ర‌ష్మీక మంద‌న ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకుంది. ఇటివ‌లే విడుద‌లైన గీత గోవిందం, దేవ‌దాస్ సినిమాల్లో న‌టించి మంచి మార్కులు కొట్టేసింది. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మీక న‌టించిన సినిమా గీత గోవింద‌. మ‌రో సారి ఈ జంటను క‌లిసి న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ మైత్రి మూవీమేక‌ర్స్ సంస్ధ‌లో డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమాలో చేస్తున్నాడు.

rashimika mandana

ఈసినిమాలో హీరోయిన్గా ర‌ష్మీక ను తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈసినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కాకినాడ‌లో చిత్ర‌క‌ర‌ణ జ‌రుగుతుంది. ఈమూవీలో ర‌ష్మీక క్రికెట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. అందుకు త‌గ్గట్టుగా ఆమె క్రికెట్ కోచింగ్ కూడా తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

mandana rashmika

ఇందులో తెలంగాణ మ‌హిళా క్రికెట‌ర్ గా ఆమె కనిపిస్తుంద‌ట‌. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతుందట. అచ్చ‌మైన తెలంగాణ యాస, మాండలికం విషయాల్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని తెలిసింది. మహిళా క్రికెటర్ పాత్రలో రాణించడానికి ఇండియన్ మాజీ క్రికెటర్ వి.వి.యస్.లక్ష్మణ్ దగ్గర క్రికెట్‌లో ప్రాథమికమైన అంశాల్ని నేర్చుకుందని స‌మాచారం. భరత్‌కమ్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

- Advertisement -