దేశంలో కొత్తగా 3,92,488 కరోనా కేసులు నమోదు..

163
India COVID-19 cases
- Advertisement -

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,92,488 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 3689 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరాయి. ఇందులో 1,59,92,271 మంది కోలుకోగా, 33,49,644 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,15,542 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 3,07,865 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.

అదేవిధంగా ఇప్పటివరకు 15,68,16,031 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా 63,282 నమోదవగా, కర్ణాటకలో 40,990, కేరళలో 35,636 రికార్డయ్యాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 802, ఢిల్లీలో 412, ఉత్తరప్రదేశ్‌లో 303 మంది మృతిచెందారు.

- Advertisement -