హిందువే..తొలి తీవ్రవాది:కమల్

244
Kamal

ఎన్నికల వేళ సినీనటుడు,మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో తొలి తీవ్రవాది హిందూ మతస్తుడేనని విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని అరవకురిచ్చి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కమల్..స్వతంత్య్య భారతదేశంలో తొలి తీవ్రవాది హిందువు…అతని పేరు నాథూరాం గాడ్సే అన్నారు.

గాడ్సేతోనే తీవ్రవాదం ప్రారంభమైందన్నారు. దేశంలో సమానత్వాన్ని కోరుకునే గొప్ప భారతీయుల్లో తాను ఒకడినని జాతీయజెండాలోని మూడు రంగులు విభిన్న విశ్వాసాలకు ప్రతీక అన్నారు. తాను గాంధీ మనవడినని చెప్పిన కమల్ ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. కమల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతుండగా కాంగ్రెస్, ద్రవిడార్‌ కజగం (డీకే) పార్టీలు మద్దతు తెలిపాయి.

గాడ్సేకి ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ ఇచ్చిందని డీకే అధినేత కె.వీరమణి తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చిన కాంగ్రెస్ నేతలు కమల్‌ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే బీజేపీ మాత్రం కమల్‌ ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదుచేసింది. మతలా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కమల్ విషయపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. మొత్తంగా ఎన్నికల వేళ కమల్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట సంచలనంగా మారాయి.