గత మూడు రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర భారత రెజ్లర్ల ఆందోళనలో పాల్గొన్న విషయం తెలసిందే. తాజాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు శుక్రవారం భారత ఒలంపిక్ సంఘం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
స్టార్ బాక్సర్ మేరీకోమ్ మేటి ఆర్చర్ డోలా బెనర్జీ రెజ్లర్ యోగేశ్వర్ దత్ అలక్‌నంద అశోక్(ఐఓఏ సంయుక్త కార్యదర్శి), సహ్‌దేవ్ యాదవ్(భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఐఓఏ కోశాధికారి), న్యాయవాదులు తాలిష్‌రాయ్, శ్లోక్‌చంద్ర కమిటీలో ఉన్నారు. అంతకు ముందు భారత రెజ్లర్ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషకు రెజ్లర్లు లేఖ రాశారు. దీంతో సాయంత్రం అత్యవసర కార్యనిర్వాహక మండలి సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మహిళలపై లైంగిక హింస నిరోధక చట్టం 2013ప్రకారం కమిటీ ఏర్పాటు చేసినట్టు కూడా పేర్కొన్నారు. దీంతో గత మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్న భారత రెజ్లర్లు నిరసనను విరమించుకున్నారు. క్రీడల మంత్ర అనురాగ్ ఠాకూర్‌తో చర్చల్లో సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీలు రావడంతో రెజ్లర్లు దిగొచ్చారు. కమటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్ భూషణ్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటారు అని మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి…