పీటీ ఉషకు అరుదైన గౌరవం

236
pt usha
- Advertisement -

పరుగుల రాష్ట్రి పీటీ ఉషకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. పీటీ ఉష ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక అనివార్యం కానుంది. 95 ఏళ్ల ఐఓఏ చరిత్రలో ఓ మహిళ అధ్యక్ష పదవిని చేపట్టనుండటం ఇదే తొలిసారి.

మేరీ కోమ్ నాయకత్వంలోని ఐఓఏ అథ్లెటిక్స్ కమిషన్ ఎంపిక చేసిన 8 మంది ‘స్పోర్స్‌పర్సన్స్ ఆఫ్ ఔట్‌స్టాండింగ్ మెరిట్’లో ఉష ఒకరు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికవుతున్న సందర్భంగా.. దిగ్గజ గోల్డెన్ గర్ల్‌, శ్రీమతి పీటీ ఉషకు అభినందనలు తెలిపారు క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు .

జులైలో బీజేపీ రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఉష. 2000 సంవత్సరంలో ఆమె అథ్లెటిక్స్ నుంచి రిటైరయ్యారు. ఆసియా క్రీడల్లో 11 పతకాలు సాధించిన ఉష.. 1986‌లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లోనే 4 పతకాలు సాధించడం విశేషం. 1983 నుంచి 1998 వరకు ఆసియన్ ఛాంపియన్షిప్స్‌లో14 స్వర్ణాలు సహా 23 పతకాలను ఉష గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -