పవన్ సినిమా… త్రివిక్రమ్ ని ట్రోలింగ్

76
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దర్శకుడు త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్. ఒకరకంగా చెప్పాలంటే త్రివిక్రమ్ పవన్ కి స్నేహితుడి కంటే ఎక్కువే. పవన్ సినిమాల కీలక నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ ఉంటాడని అందరికీ తెలిసిందే. ఇటివల పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక కి అన్ని తానై త్రివిక్రమ్ వెనకుండి నడిపించాడు. తక్కువ అనుభవం ఉన్న దర్శకుడు సాగర్ కే చంద్రను ఆ సినిమాకు డైరెక్టర్ గా పెట్టుకొని త్రివిక్రమే సలహాలు సూచనలు ఇచ్చాడు. ముఖ్యంగా సినిమా కాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ నిర్ణయమే ఉందని అప్పట్లో ఓ టాక్ ఉంది. దీంతో దర్శకుడు సాగర్ కి ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్లస్ అవ్వలేదు.

తాజాగా పవన్ కళ్యాణ్ , సుజీత్ సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎనౌన్స్ అయిన మరుక్షణమే త్రివిక్రమ్ ను ట్రోలింగ్ చేస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. సుజీత్ ను త్రివిక్రమ్ కన్విన్స్ చేస్తూ అక్కడ ఆ సీన్ యాడ్ చెయ్ రా , పూజా హెగ్డే ను హీరోయిన్ గా పెట్టుకోరా అంటూ చెప్తున్నట్టు సుజీత్ వాటికి నో చెప్తున్నట్లు మీమ్స్ క్రియేట్ చేశారు.

నిజానికి సుజీత్ చేసింది రెండే సినిమాలయినప్పటికీ సాహో ఎక్స్ పీరియన్స్ ఎక్కువే. ప్రభాస్ తో అల్టిమేట్ స్టైలిష్ యాక్షన్ సినిమా తీసిన అనుభవం ఉంది. పైగా వెనుక డీవీవీ దానయ్య లాంటి బడా నిర్మాత ఉన్నారు. ఇక త్రివిక్రమ్ సలహాలు , సూచనలు ఈ ప్రాజెక్ట్ కి అవసరం లేదనే చెప్పాలి. పైగా భీమ్లా నాయక్ కి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. పైగా సితార బేనర్ కాబట్టి త్రివిక్రమ్ ఆ సినిమాకు వెనుక ఉన్నాడు. ఇప్పుడు పవన్ సుజీత్ సినిమాకి త్రివిక్రమ్ కి ఎలాంటి సంబంధం లేదు. పవన్ కూడా ఈ సినిమాను సుజీత్ కే వదిలేయబోతున్నాడు. యాంటీ ఫ్యాన్స్ , నెటిజన్లు మరి త్రివిక్రమ్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో మరి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -