వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం..

112
- Advertisement -

కోల్‌కతాలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పైచేయి సాధించిన భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. తొలి ఓవ‌ర్‌లోనే ఓపెన‌ర్ బ్రెండన్ కింగ్ (4) ఔట‌య్యాడు. మరో ఓపెన‌ర్ కైల్ మేయ‌ర్స్ ( 31 ) ఫ‌ర్వాలేద‌నిపించాడు. టీమిండియా క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో వెస్టిండీస్ బ్యాట‌ర్లకు చెమ‌ట‌లు ప‌ట్టించింది. దీంతో రోస్ట‌న్ ఛేజ్ (4) రోమ‌న్ పావెల్ ( 2), అకీల్ హోసీన్ (10), ఒడియ‌న్ స్మిత్ ( 4) ఏ మాత్రం రాణించ‌లేక‌పోయారు. నికోల‌స్ పూర‌న్ (61) ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ఫ‌లితంగా నిర్ణీత ఓవ‌ర్లు ముగిసేస‌రికి 157 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

ఆ త‌ర్వాత ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన‌ టీమిండియా శుభారంభం చేసింది. రోహిత్ శ‌ర్మ (40), ఇషాన్ కిష‌న్ (35) రాణించారు. విరాట్ కోహ్లీ (17), రిష‌బ్ పంత్ (8) ఆక‌ట్టుకోలేక‌పోయారు. కానీ సూర్య‌కుమార్ యాద‌వ్ (34), వెంక‌టేశ్ అయ్య‌ర్ (24) నిల‌క‌డ‌గా ఆడుతూ టీమిండియాను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. దీంతో ఇంకా 7 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ను చేధించారు.

- Advertisement -