నేడు విండిస్ తో భారత్ రెండో టీ20

401
ind vs westindies
- Advertisement -

వెస్టిండిస్ తో మొదటి టీ20లో ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలో నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గనుక ఇండియా గెలిస్తే 2-0లో సిరీస్ కైవసం చేసుకోనుంది. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైన గెలవాలని రెండు టీమ్ లు కసితో ఉన్నాయి. మొదటి మ్యాచ్ లో భారీ స్కోర్ చేసినా ఓడిపోవడాన్ని వెస్టిండిస్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వెస్టిండీస్‌పై తొలి టీ20లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఒపెనర్ రోహిత్ శర్మ 8పరుగులకే అవుట్ కావడంతో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు ఇద్దరి విజృంభించి ఆడారు. కాగా సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక రన్స్ సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్‌ (2547), కోహ్లీ (2544)కి ఈ మ్యాచ్‌ పోటాపోటీగా మారింది.విండీస్‌తో తొలి టీ20లో 94 పరుగులతో అదరగొట్టిన కెప్టెన్ కోహ్లీ… ఇప్పటివరకు టీ20ల్లో చేసిన పరుగులు 2544 కాగా… మరో 3 పరుగులు చేస్తే రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును అధిగమించనున్నాడు.

- Advertisement -