నేడు భారత్-వెస్టిండీస్ మొదటి టీ20..

288
India vs West Indies
- Advertisement -

వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమ్‌ఇండియా, 3-1 తేడాతో వన్డే సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు(ఆదివారం) కోల్‌కతా వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వడంతో.. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది.

India vs West Indies

జట్లు.. భారత్‌: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), ధావన్‌, రాహుల్‌, కార్తీక్‌, మనీష్‌ పాండే, రిషబ్‌ పంత్‌, కృనాల్‌ పాండ్య, చాహల్‌, కుల్‌దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌

వెస్టిండీస్‌: కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), అలెన్‌, డారెన్‌ బ్రావో, హెట్‌మెయర్‌, కీమో పాల్‌, పొలార్డ్‌, రామ్‌దిన్‌, రుథర్‌ఫోర్డ్‌, ఒషానె థామస్‌, కారె పియరీ, మెకాయ్‌, రొమాన్‌ పావెల్‌, నికోలాస్‌ పూరన్‌.

- Advertisement -