న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత్ భారీ విజయాన్ని సాధించింది. 35 పరుగుల తేడాతో కీవిస్ ను చిత్తుగా ఓడించింది. 4-1 తేడాతో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 252పరుగులకు ఆలౌట్ అయింది. మొదట్లో 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇండియాకు షాక్ తగిలింది. ఆతర్వాత వచ్చిన హైదరబాద్ ఆటగాడు అంబటి రాయుడు 90 పరుగులు చేసి టీంఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అంబటి రాయడు 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో మన్రోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. జాదవ్ 34, విజయ్ శంకర్ 45 పరుగులు చేసి అవుటయ్యారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 45 పరుగులు చేసి నీషమ్ బౌలింగ్ లో బౌల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఇండియా ఆలౌట్ అయింది.
253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా తడబాటుకు గురైంది. 38 పరుగులకే కివీస్ మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో చాహల్ 3 వికెట్ల తీయగా షమీ, పాండ్యాలు రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, జాధవ్ లు చెరో వికెట్ తీశారు.