సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌.. వీడియో

268
- Advertisement -

ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం పేట‌. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ చిత్రం విడుద‌లై నేటికి 25 రోజులు కావ‌డంతో ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజు త‌న ట్విట్ట‌ర్‌లో ర‌జనీకాంత్ పేట చిత్రానికి డైలాగ్ చెబుతున్న డ‌బ్బింగ్‌ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియో అభిమాన‌లుకి మంచి కిక్ ఇస్తుంది.

Petta Movie

ఈ మూవీలో రజనీకి జోడీగా సిమ్రన్‌, త్రిష నటించారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మాతగా వ్యవహరించారు. త్వరలో రజనీ.. ఏ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నారు. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం రజనీ తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

- Advertisement -