గిల్‌ సెంచరీ వృథా…భారత్‌పై బంగ్లా గెలుపు

26
- Advertisement -

ఆసియా కప్‌లో చివరి నామమాత్రపు మ్యాచ్‌లో టీమిండియాను ఓడించింది బంగ్లాదేశ్. సూపర్ 4 చివరి మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌట్ అయింది. గిల్, అక్షర్ పటేల్ తప్ప మిగితా బ్యాట్స్ మెన్ అంతా విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా గిల్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. 121 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ చివరలో ఔట్ కావడంతో భారత్ ఓటమి తప్పలేదు. అక్షర్‌ పటేల్‌ (42) రాణించగా కెప్టెన్‌ రోహిత్‌ (0), తెలంగాణ కుర్రాడు తిలక్‌ వర్మ (5), కేఎల్‌ రాహుల్‌ (19), ఇషాన్‌ కిషన్‌ (5), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 265 పరుగులు చేసింది. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తౌహిద్‌ (54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నసుమ్‌ అహ్మద్‌ (44; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించారు. షకీబ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కగా ఆదివారం ఫైనల్లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది.

Also Read:నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్…షెడ్యూల్ ఇదే

- Advertisement -