నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్…షెడ్యూల్ ఇదే

37
- Advertisement -

ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన నాగర్ కర్నూల్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు నాగర్ కర్నూల్ లోని తేజ గార్డెన్స్ కు చేరుకోనున్నారు. అక్కడే భోజనం చేసి…మధ్యాహ్నం 2:30 కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్ కు చేరుకోనున్నారు.

అనంతరం కంట్రోల్ రూమ్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు. నాలుగు గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. నాలుగు గంటల 45 నిమిషాలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ఐదు గంటలకు రోడ్డు మార్గాన సభాస్థలికి చేరుకోనున్న సీఎం…అనంతరం కొల్లాపూర్ లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్…తెలంగాణ సాగునీటిరంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం. వలసలతో విలపించిన పాలమూరును పాలు పొంగే జీవగడ్డగ మార్చనుంది. కరువు కాటకాలను శాశ్వతంగా తరిమికొడుతూ.. కృష్ణా జలాలతో ఆరు జిల్లాలను సస్యశ్యామలం చేయనున్నారు సీఎం. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్​నగర్, రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు త్రాగునీరు అందించనుంది.

Also Read:లవ్ మౌళి … క్రేజీ సాంగ్

- Advertisement -