ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్ తర్వాత ఆసీస్ భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో రెండు టీ20లు,ఐదు వన్డేలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ టూర్ షెడ్యూల్‌ని విడుదల చేసింది బీసీసీఐ.
మార్చి 2వ తేదీన జరిగే తొలి వన్డే మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. రెండో వన్డే మార్చి 5న నాగ్‌పూర్‌లో, 8న మూడో వన్డే రాంచీలో, 10న నాలుగో వన్డే మొహాలీలో, 13న ఐదో వన్డే ఢిల్లీలో జరగనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు వన్డే మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
ఫిబ్రవరి 24న బెంగళూరులో తొలి టీ20, 27న విశాఖపట్నంలో రెండో టీ20 మ్యాచ్ జరగనున్నాయి. టీ20 మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
NEWS: BCCI announces fixtures for home season against Australia
Full details here —–> https://t.co/lk6ytRpbv3 pic.twitter.com/vStNMGRGfV
— BCCI (@BCCI) January 10, 2019