పేట వర్సెస్ విశ్వాసం..ఫ్యాన్స్ వార్‌

230
Petta Vs Viswasam

ఓ వైపు సంక్రాంతి సినిమాల రేసులో నిర్మాతల మధ్య వార్‌ నెలకొనగా తమిళనాడులో మాత్రం అభిమానుల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన పేట-తలా అజిత్ నటించిన విశ్వాసం రెండు ఒకేసారి ప్రేక్షకుల ముందుకువచ్చాయి.

ఇద్దరు అగ్రహీరోల సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్పఅంటూ వాగ్వాదానికి దిగారు. గొడవ ముదిరి ఘర్షణకు దారి తీయడంతో నలుగురికి గాయాలయ్యాయి.

సరైన భద్రత లేకపోవడంతో రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు రజనీ,అజిత్ ఫ్యాన్స్‌ . వేలూరులోని ఓ థియేటర్‌ ముందు రజినీ, అజిత్ హీరోల అభిమానుల కత్తులతో దాడి చేసుకున్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆలస్యంగానైనా రంగప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.