చైనాకు సంబంధించిన 59 రకాల యాప్స్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. టిక్ టాక్ తో పాటు మరిన్ని యాప్ లను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక టిక్ టాక్ యాప్ బ్యాన్ విషయంపై స్పందించారు ఇండియా యాజమాన్యం. తాము ఏ తప్పూ చేయలేదని, ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరుగలేదని స్పష్టం చేసింది. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నాం. భారత యూజర్లకు చెందిన సమాచారాన్ని చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ పంచుకోలేదు అని టిక్ టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని, తమ అభ్యంతరాలను తెలియజేస్తామని, ప్రభుత్వానికి ఏమైనా అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేస్తామని ఆయన అన్నారు.యూజర్ ప్రైవసీ, సమాచారానికి అత్యున్నత ప్రాముఖ్యతను ఇచ్చినట్లు టిక్‌టాక్ ఇండియా తెలిపింది. భారత ప్రభుత్వానికి తాము వివరణ ఇస్తామని లేఖలో పేర్కోన్నారు.