టిక్ టాక్ బ్యాన్..వార్నర్ పై సెటైర్ వేసిన అశ్విన్

92
david warner ashwin

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు కెప్టెన్ గా ఉండటంతో తెలుగు పాటలకు టిక్ టాక్ లో వార్నర్ స్టెప్పులు వేశారు. మొదటగా ఆయన అల్లు అర్జున్ అల..వైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ కు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో చాలా వైరల్ అయింది. దీంతో ఆయన వరుసగా తెలుగు పాటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి స్టెప్పులు వేస్తున్నారు. దీంతో ఆయనకు పెద్ద ఎత్తను ఫాలోవర్స్ పెరిగిపోయారు. భారతీయ పాటలకు వీడియోలు చేస్తూ టిక్‌టాక్‌లో వార్నర్‌ ఏకంగా 4.8 ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు.

ఇక తాజాగా ఇండియాలో టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో టిక్ టాక్ యాప్ బ్యాన్ పై వార్నర్ పై సెటైర్లు వేశారు భారత బౌలర్ రవిచింద్రన్ అశ్విన్. ‘అప్పో అన్వర్‌?’ అంటూ డేవిడ్ వార్నర్‌కు ట్వీట్ చేస్తూ నవ్వుతోన్న ఎమోజీని ట్వీట్ చేశాడు. భారత్‌లో చైనా యాప్‌లను బ్యాన్‌ చేసిన విషయానికి సంబంధించిన వార్తను పోస్ట్ చేశాడు. వార్నర్‌ను ట్రోల్‌ చేస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. అశ్విన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.