ధర్మశాల టెస్టు టీమిండియాదే..

227
India sweep season with fourth series win
- Advertisement -

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్ట్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో సునాయసంగా గెలుపొందింది. 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 23.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ఓవర్ నైట్ స్కోరు 19 పరుగులతో బరిలోకి దిగిన భారత్, మురళీ విజయ్, పుజారాల వికెట్లను కోల్పోయినప్పటికీ, రాహుల్, రహానేను భారత జట్టును విజయ తీరాలకు చేర్చి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 76 బంతులాడిన రాహుల్ 9 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. గత ఏడు ఇన్నింగ్స్ లో రాహుల్ కిది ఆరో అర్థ శతకం కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్‌ లోకేష్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అర్థశతకం సాధించి జట్టు విజయంతో కీలక పాత్ర పోషించాడు. రాహుల్‌కు తోడుగా రహానే 27 బంతుల్లో 38(4*4,2*6)రాణించడంతో భారత్ మరో రోజు ఆటమిగిలి ఉండగానే విజయబావుటా ఎగురవేసింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఆసీస్‌పై విజయంతో  స్వదేశంలో తనకు తిరుగేలేదని టీమిండియా మరోసారి నిరూపించింది. స్వదేశంలో వరుసగా ఏడో సిరీస్‌ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. స్వదేశంలో 2015 నుంచి భారత్‌ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2015 నుంచి స్వదేశంలో 25 టెస్టులు ఆడిన భారత్‌ ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది. రెండు టెస్టుల్లో ఓటమి పాలు కాగా.. మరో రెండింటిని డ్రాగా ముగించింది. కోహ్లి స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన అజింక్య రహానే కెప్టెన్‌గా తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు.

- Advertisement -