‘ఉస్తాద్‌’గా బాలయ్య..!

232
Balaiah- Puri Movie Title as Ustad
- Advertisement -

తిట్లు, చీవాట్ల‌ను సినిమాల‌కు టైటిల్స్‌గా పెట్టడంలో పూరి స్టైలే వేరు. పోకిరి,ఇజం,రోగ్,ఇజం,ఇడియట్ వంటి టైటిల్స్‌తో ఆకట్టుకున్న పూరి తాజాగా బాలయ్య సినిమాకు అలాంటి టైటిల్‌నే పెట్టేందుకు సిద్దమవుతున్నాడా..! అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. తొలుత టపోరి అనే టైటిల్ ఖరారైనట్లు వార్తలు వెలువడ్డాయి. టపోరి అనేది హిందీ పదం. టపోరి అంటే తెలుగులో రౌడీ అని అర్థం. టైటిల్ క్యాచీగా ఉండడం, చిన్నగా ఉండడంతో పూరీ ఆ టైటిల్ వైపు మొగ్గుచూపుతున్నాడని అంతా భావించారు.

అయితే, ఇప్పుడు మరో కొత్త టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రెండవ షెడ్యూల్ సమయానికి కథానాయిక విషయంలోను .. టైటిల్ విషయంలోను క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనలో పూరీ  వున్నాడని అంటున్నారు.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాలో బాలయ్య క్యారెక్టర్‌ గురించి పూరి చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్‌ స్టర్‌గా   రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తాడంటూ, ఈ సినిమాపై పూరీ ఆసక్తిని రేకెత్తించాడు. అంతేగాదు బాలయ్యతో  ముగ్గురు భామలు రొమాన్స్ చేయనున్నారు.

భవ్య క్రియేషన్స్‌ అధినేత వి. ఆనంద్‌ప్రసాద్‌  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ గత చిత్రాలకు ఈ సినిమా భిన్నంగా ఉండనుందట.  సెప్టెంబర్‌ 29ప  ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్, హీరోయిన్లు ఇంకా కన్ఫామ్ కాకపోవడంతో  ఎవరికి ఛాన్స్ తగలనుందా అనీ .. టైటిల్ ఎలా వుండనుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -