భారత్ – శ్రీలంక మధ్య ఫస్ట్ టెస్ట్ కు అంతా రెడీ అయ్యింది. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇవాళ్టి నుంచి గాలేలో తొలి టెస్ట్ జరగనుంది. అయితే శ్రీలంకతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగానే ఉంది. జ్వరం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ మ్యాచ్ కు అందుబాటులో లేకపోయినా.. అభినవ్ ముకుంద్ తో…శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. మిడిలార్డర్ లో పుజారా, కోహ్లి, రహానే సాహాలకు తోడు వన్డేల్లో సక్సెస్ ఫుల్ ఆడుతున్న హార్దిక్ పాండ్యా తొలిసారి టెస్టుల్లో ఆడబోతున్నాడు. అటు కీలక ఆటగాళ్లు దూరం కావడంతో శ్రీలంకకు ఇబ్బందుల్లో ఉంది. కెప్టెన్ చండిమాల్ న్యుమోనియాతో తొలిటెస్ట్ కు దూరమయ్యాడు. దీనికి తోడు జింబాబ్వేతో వన్డే సిరీస్ ఓటమి వారిని వెంటాడుతనే ఉంది.
ఈ సిరీస్‌లో భారతే తిరుగులేని ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కిందటి పర్యటన (2015)లో ఇదే గాలెలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ ఉంది 176 పరుగుల లక్ష్యఛేదనలో 112 పరుగులకే కుప్పకూలిన టీమ్‌ఇండియా ఆ తర్వాత కసిగా ఆడి సిరీస్‌ను చేజిక్కించుకుంది. అదే జోరును కొనసాగించి నంబర్‌వన్ స్థానానికి ఎదిగింది.
గాలె పిచ్‌పై స్వల్పంగా పచ్చిక కనిపిస్తోంది. ఐతే టెస్టు మ్యాచ్ ఆఖరి రోజుల్లో పిచ్ స్పిన్నర్లకు సహకరించడం ఇక్కడ మామూలే. తొలి రెండు రోజులైతే పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తుందని రెండు జట్లు భావిస్తున్నాయి. గాలెలో ఏడాదిలో ఈ సమయంలో మధ్యాహ్నం వర్షం పడే ముప్పు ఎప్పుడూ పొంచే ఉంటుంది. గాలెలో భారత్‌పై శ్రీలంకకే మంచి రికార్డుంది. రెండు జట్లు నాలుగు మ్యాచ్‌ల్లో తలపడగా శ్రీలంక మూడు నెగ్గింది. భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచింది.
తుది జట్లు (అంచనా)..
భారత్: ముకుంద్, శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె,హార్దిక్ పాండ్య, సాహా, అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్, షమి
శ్రీలంక: ఉపుల్ తరంగ, దిముత్ కరుణ రత్నె, కుశాల్ మెండిస్, దనుష్క గుణతిలక, ఏంజెలో మాథ్యూస్, నిరోషన్ డిక్వెలా, అసెలా గుణరత్నె, దిల్రువన్ పెరీరా, రంగన హెరాత్, లాహిరు కుమార, నువాన్ ప్రదీప్