దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పలు రాష్ట్రల్లో మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 14,199 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 9,695 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,05,850కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 83 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,385కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,99,410 మంది కోలుకున్నారు. 1,50,055 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,11,16,854 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది.