దేశంలో కొత్త‌గా 6,563 క‌రోనా కేసులు నమోదు..

120
- Advertisement -

భారత్‌లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్త‌గా 6,563 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. గత 24గంటల్లో క‌రోనాతో 132 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న దేశంలో మొత్తం 8,077 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 572 రోజుల క‌నిష్ఠానికి త‌గ్గింది. దేశంలో ప్ర‌స్తుతం 82,267 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికి‌త్స తీసుకుంటున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,77,554కు చేరింది.

కాగా, దేశంలో కరోనా రికవరీ రేటు 98.39 శాతం ఉన్నదని, మరణాల రేటు 1.37 శాతం, యాక్టివ్‌ కేసులు 0.24 శాతం ఉన్నాయని తెలిపింది. ఆదివారం రాత్రివరకు దేశవ్యాప్తంగా 1,37,67,20,359 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒకేరోజు 15,82,079 మంది టీకాలు తీసుకున్నారని వెల్లడించింది.

- Advertisement -