శ్రీవారిని సన్నిధిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రవీంద్ర రావు..

30

సోమవారం తిరుమల శ్రీవారిని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ రవీంద్ర రావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ రవీంద్ర రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఆయురారోగ్యాలు ప్రసాధించాలని దేవున్ని ప్రార్ధించానన్నారు.