దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 41,506 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే 41,526 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,95,716కు చేరింది. మరణాల విషయానికొస్తే, 24 గంటల్లో 895 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,040కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,99,75,064 మంది కోలుకున్నారు. 4,54,118 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.47 శాతమని, రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగిందని, పాజిటివిటీ రేటు 2.25 శాతం ఉన్నదని తెలిపింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 37,60,32,586 డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. గత 24 గంటల్లో 37,23,367 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.