పోలీసులను ఆశ్రయించిన నటుడు మోహన్ బాబు..

218
mohan babu
- Advertisement -

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత మోహన్‌బాబు పోలీసులను ఆశ్రయించారు. ఎందుకు అని షాక్ అవుతున్నారా.. విషయం ఏంటంటే.. తనను వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేస్తున్నారంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో భాగమైన యూట్యూబ్‌లో తనను ట్రోల్ చేస్తూ దూషిస్తున్నారంటూ హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వ్యక్తిగతంగా తిడుతుండటమే కాకుండా… అసభ్యకరమైన బూతులతో కామెంట్ల రూపంలో, వీడియోల రూపంలో పోస్టులు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -