76 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అయితే ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానీయులు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారు. ఒక్కొక్కరిది ఒక్కో విధానం…కానీ అంతిమంగా అందరి పోరాటం దేశానికి స్వాతంత్య్రం కోసమే. రవి అస్తమించని బ్రిటిష్ సామ్య్రాజ్యాన్ని మెడలు వంచి చివరకు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని దక్కించుకున్నాం.
ఇక ఈ 76 ఏళ్లలో భారతదేశం ఎంతో అభివృద్ధిని సాధించింది. అన్నిరంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. ఎందరో ప్రముఖులు భారత్‌కు కీర్తి ప్రతిష్టలు అందించి విశ్వ వేదికపై భారత్ సత్తా చాటారు. అనేక రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ సాధించి పెట్టారు.
అనేక జాతీయ శాస్త్ర పరిశోధనా సంస్థలు ఉన్నాయి. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం తదితర స్వయం సాధికారత ఆహార పథకాల్లో ముందడుగు వేశాం. అలాగే ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగంలో అనేక ఫ్యాక్టరీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇవన్నీ భారత శాస్త్ర, సాంకేతిక రంగానికి గట్టి పునాది. ఇవన్నీ మహత్తరమైన సైన్స్ సౌధ నిర్మాణానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేశాయి.
స్వాతంత్రం రావడానికి ముందు సాహిత్యంలో రవీంద్ర నాథ్ ఠాగూర్, ఫిజిక్స్‌లో సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మదర్ థెరిసా, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి వంటి వారు నోబెల్ గెలుచుకున్నారు.
()సేవకు మారు పేరు మథర్ థెరిస్సా..సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా మదర్ థెరిసా చేస్తున్న సేవలను గుర్తించిన నోబెల్ బహుమతి కమిటీ ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందించింది…
()స్వాతంత్ర భారతంలో దేశానికి మరో నోబెల్ బహుమతి సాధించిపెట్టిన ఆర్థిక నిపుణుడు, తత్వ శాస్త్రవేత్త అమర్త్య సేన్. ఆయనకు 1998లో మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థికశాస్త్రము, పేదరికానికి గల కారణాలు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికిగానూ నోబెల్ బహుమతి లభించింది.
Also Read:టి కాంగ్రెస్ వారిద్దరినే నమ్ముకుందా?
()నోబెల్ బహుమతి సాధించిన మరో భారతీయుడు కైలాష్ సత్యార్థి. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకు గాను, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2014లో మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. హర్ గోవింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీకి నోబెల్ దక్కింది..
Also Read:స్వాతంత్య్రానికి ముందు తర్వాత..దేశంలో జరిగిందిదే!